: భారత్, ఆసీస్ మూడో టెస్టు: ఆసీస్ స్కోరు 48/2


రాంచీ వేదిక‌గా భార‌త్‌, ఆస్ట్రేలియా జట్ల మ‌ధ్య‌ జరుగుతున్న మూడో టెస్టు మ్యాచులో ఫ‌లితం తేలాల్సి ఉన్న‌ చివ‌రిరోజు ఆట ప్రారంభ‌మైంది. మొద‌టి ఇన్నింగ్స్‌లో టీమిండియా 603/9గా డిక్లేర్ చేసిన విష‌యం తెలిసిందే. నిన్న రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ ప్రారంభించిన‌ ఆసీస్ 23 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. ఈ రోజు ప్రారంభ‌మైన ఆట‌లో ప్ర‌స్తుతం క్రీజులో రెన్షా 14, స్మిత్ 15 ప‌రుగుల‌తో ఉన్నారు. ప్రస్తుతం ఆసీస్ స్కోరు రెండు వికెట్ల న‌ష్టానికి 48గా ఉంది. ఆసీస్ బ్యాట్స్‌మెన్ వార్న‌ర్‌(14), లియాన్ (12)ల వికెట్ల‌ను టీమిండియా బౌల‌ర్ జడేజా తీశాడు.

  • Loading...

More Telugu News