: ఐడియాలో విలీనమైన వోడాఫోన్... ఇండియాలో అతిపెద్ద టెలికం సంస్థగా అవతరణ


ఇండియాలో అతిపెద్ద టెలికం సంస్థగా ఐడియా సెల్యులార్ అవతరించింది. మరో టెల్కో వోడాఫోన్ ను తమ సంస్థలో విలీనం చేసుకున్నట్టు ఐడియా ప్రకటించింది. దీంతో వినియోగదారుల పరంగా ఎయిర్ టెల్ కన్నా అధిక స్థాయికి ఐడియా చేరుకున్నట్లయింది. ఆదాయం పరంగా కూడా ఎయిర్ టెల్, రిలయన్స్ జియోలకన్నా ఐడియా ముందు నిలిచింది. కొత్త సంస్థలో వోడాఫోన్ కు 45 శాతం వాటాలుంటాయని, ఐడియా ప్రమోటర్లకు 26 శాతం వాటాలు, ఏబీ గ్రూప్ నకు 9.5 శాతం వాటాలుంటాయని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఇరు సంస్థలూ విలీనమైన తరువాత 40 శాతం మార్కెట్ వాటా, రూ. 80 వేల కోట్ల రూపాయలకు పైగా ఆదాయం నమోదవుతుందని బ్రోకరేజ్ సంస్థ సీఎల్ఎస్ఏ అంచనా వేసింది.

  • Loading...

More Telugu News