: స్టాక్ మార్కెట్ లో 'యూపీ సీఎం' ప్రకంపనలు... లాభాల స్వీకరణకు దిగిన ఇన్వెస్టర్లు
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా కరుడుగట్టిన హిందుత్వ వాది, వివాదాస్పద నేత యోగి ఆదిత్యనాథ్ ను బీజేపీ ఎంచుకున్న తరువాత, మార్కెట్ నిపుణులు అంచనా వేసినట్టుగానే ఈ ఉదయం స్టాక్ మార్కెట్ ప్రారంభం కాగానే ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. ఇండియాలోనే అత్యధికంగా జనాభా ఉన్న యూపీ సీఎంగా యోగి ఎన్నికైన నేపథ్యంలో, భవిష్యత్ సంస్కరణలపై మార్కెట్ వర్గాల్లో ఆందోళన నెలకొని ఉండటమే ఇందుకు కారణమని అంటున్నారు. ముఖ్యంగా విదేశీ ఇన్వెస్టర్లు నేడు అమ్మకాలకు దిగినట్టు తెలుస్తోంది. ఈ ఉదయం 9:30 గంటల సమయంలో బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక, క్రితం ముగింపుతో పోలిస్తే, 101 పాయింట్లు పడిపోయి 29,547 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 23.40 పాయింట్లు పడిపోయి 9,136 పాయింట్ల వద్దా కొనసాగుతున్నాయి. నిఫ్టీ-50లో 22 కంపెనీలు లాభాల్లో నడుస్తున్నాయి.