: అవును.. నాకూ అలాంటి పరిస్థితి ఎదురైంది.. అందుకే అటువంటి సీన్లలో నటించా: కాజల్


సినిమా ఇండస్ట్రీలో తాము ఎటువంటి అనుభవాలు ఎదుర్కొన్నామో ఇటీవల కొందరు నటీమణులు చెప్పుకొచ్చారు. ఇప్పుడు టాలీవుడ్ నటి కాజల్ అగర్వాల్ కూడా తన అనుభవాన్ని బయటపెట్టింది. సినీ పరిశ్రమలో ఒక్క చాన్స్ కోసం మీరెప్పుడైనా కాంప్రమైజ్ అయ్యారా? మీరలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారా? అన్న ప్రశ్నకు కాజల్ స్పందిస్తూ నిజానికి అలాంటి సందర్భం ఎదురుకాకపోయినా దాని గురించి విన్నానని పేర్కొంది. అవకాశాల కోసం తామెలా రాజీపడాల్సి వచ్చిందో కొందరు హీరోయిన్లు చెప్పారని, అది చాలా బాధాకరమని పేర్కొంది.

పాటల్లో అభ్యంతరకర సీన్ల విషయంలో మాత్రం తనకు అటువంటి అనుభవమే ఎదురైందని తెలిపింది. పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో తనకేం తెలిసేది కాదని, అందుకని అభ్యంతరకర సన్నివేశాల్లో నటించాల్సి వచ్చిందని వివరించింది. అయితే ఆ తర్వాత తప్పు తెలుసుకుని ఆ రూట్‌ను వదిలేశానని పేర్కొంది. అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా పాత్రలను ఎంపిక చేసుకుంటున్నానని తెలిపింది. ఎవరి కోసమో రాజీపడడంలో అర్థం లేదని తెలుసుకున్నానని, ప్రస్తుత స్థాయి తనకు ఆనందంగా ఉందని కాజల్ చెప్పుకొచ్చింది.

  • Loading...

More Telugu News