: ఎయిర్ కోస్టాను వీడుతున్న పైలెట్లు.. 40 మంది ఔట్!


అప్పుల ఊబిలో చిక్కుకుపోయిన ‘ఎయిర్ కోస్టా’ పని అయిపోయినట్టేనా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సంక్షోభంలో చిక్కుకుపోయిన సంస్థను ఆదుకునేందుకు ప్రమోటర్లు ముందుకు రాకపోవడంతో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జీతాలు చెల్లించకపోవడంతో పైలెట్లు వరుసగా సంస్థను వీడుతున్నారు. ఇప్పటి వరకు 40 మంది పైలెట్లు సహా కొందరు సిబ్బంది కూడా సంస్థను వీడినట్టు సమాచారం. జనవరి నుంచి జీతాలు చెల్లించడం లేదని, ఇది మరో ‘కింగ్‌ఫిషర్’లా మారడం ఖాయమని ఉద్యోగులు చెబుతున్నారు. కాగా ఫిబ్రవరి 28 నుంచి ఎయిర్‌కోస్టా విమాన సర్వీసులు ఆగిపోయిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News