: నేను హీరోని అవుతానని మొదట చెప్పింది చిరంజీవి గారే: శరత్ కుమార్


తాను హీరోని అవుతానని మొట్ట మొదట చెప్పింది మెగాస్టార్ చిరంజీవేనని రాజకీయ నాయకుడు, దక్షిణాది నటుడు శరత్ కుమార్ అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, గ్యాంగ్ లీడర్ సినిమాతో తనకు మంచి గుర్తింపు వచ్చిందని అన్నారు. ఈ చిత్రం తర్వాత మరో చిత్రంలో చిరంజీవితో కలిసి నటించాలని ఆయన్ని అడిగానని .. అప్పుడు.. ‘నువ్వు హీరో అయిపోతావు’ అని చిరంజీవి చెప్పారని అన్నారు.

తాను పేపర్ బోయ్ స్థాయి నుంచి ఎదిగి పార్లమెంట్ వరకు వెళ్లానని, ట్రావెల్ ఏజెన్సీ పెట్టి, ఆ తర్వాత నిర్మాతగా మారానని చెప్పారు. తెలుగులో తనకు నచ్చిన హీరో చిరంజీవి అని, చిరంజీవి తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటన, డ్యాన్స్ లు బాగా చేస్తారని అన్నారు. రాధిక, తాను, అరవింద స్వామి మంచి మిత్రులమని చెప్పారు. పదేళ్ల స్నేహం తర్వాతే రాధికను పెళ్లి చేసుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు. మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నెంబర్ 150’ లో తాను నటించాల్సి ఉంది కానీ, కుదరలేదని అన్నారు.

  • Loading...

More Telugu News