: వరంగల్ ‘నిట్’లో విద్యార్థి ఆత్మహత్య!
వరంగల్ ‘నిట్’లో సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్న ఫైనల్ ఇయర్ విద్యార్థి సంకేత్ కుమార్ ఈ రోజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిట్ లోని దాసా హాస్టల్ బిల్డింగ్ లోని ఆరో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతను కిందకు దూకడాన్ని గమనించిన తోటి విద్యార్థులు అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. సంకేత్ కుమార్ స్వస్థలం మహారాష్ట్ర అని, ఆత్మహత్యకు గల కారణాలు తెలియవని తోటి విద్యార్థులు తెలిపారు. అయితే, అతని ఆత్మహత్యకు కారణం ప్రేమ వ్యవహారమేనని తెలుస్తోంది.