: సీఎం కేసీఆర్ ను కలిసిన కేరళ ముఖ్యమంత్రి


సీఎం కేసీఆర్ ను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈరోజు హైదరాబాదులో కలిశారు. ప్రగతిభవన్ లో కేసీఆర్ తో కలిసి ఆయన లంచ్ చేశారు. అనంతరం, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు, టూరిజం, హెల్త్ టూరిజం, ఐటీ లాంటి అంశాలపై వారు చర్చించుకున్నారు. రెండు రాష్ట్రాల అభివృద్ధిపై వారు మాట్లాడుకున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై పినరయి విజయన్ హర్షం వ్యక్తం చేశారు.

కేరళలోని ప్రముఖ పుణ్య క్షేత్రం శబరిమలలో తెలంగాణ అతిథి గృహం నిర్మాణం కోసం త్వరగా భూ కేటాయింపులు చేయాలని ఈ సందర్భంగా విజయన్ ను కేసీఆర్ కోరారు. కాగా, హైదరాబాద్ లోని సరూర్ నగర్ లో నిర్వహిస్తున్న సీపీఎం సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజయన్ రాకను నిరసిస్తూ ఏబీవీపీ కార్యకర్తలు ఆర్టీసీ కల్యాణ మండపం వద్ద ఆందోళనకు దిగారు. కేరళలో బీజేపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై పినరయి విజయన్ ఏ మాత్రం స్పందించడం లేదని వారు ఆరోపించారు.

  • Loading...

More Telugu News