: యూపీ లో కొత్త ప్రభుత్వంపై నాకు అపారమైన నమ్మకం ఉంది: ప్రధాని నరేంద్ర మోదీ
ఉత్తరప్రదేశ్ లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వంపై తనకు అపారమైన నమ్మకం ఉందని, రాష్ట్రాన్ని రికార్డు స్థాయిలో అభివృద్ధి చేస్తారని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఉత్తరప్రదేశ్ ను 'ఉత్తమ'ప్రదేశ్ గా తీర్చిదిద్దే క్రమంలో కొత్త ప్రభుత్వం ఎటువంటి విమర్శలకు తావివ్వదనే నమ్మకం తనకు ఉందని అన్నారు. మన ఏకైక లక్ష్యం, ఉద్దేశం .. అభివృద్ధి. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందితే, భారతదేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు.
యూపీ యువతకు అవకాశాలు సృష్టించి వారికి అండగా నిలుస్తామని మోదీ పేర్కొన్నారు. ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎంలు కేశవ ప్రసాద్ మౌర్య, దినేష్ శర్మలకు తన శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని, యూపీ ప్రజలకు సేవలందించనున్న వారికి తన ‘బెస్ట్ విషెస్’ అని మోదీ తెలిపారు.