: మోహన్ బాబు జన్మదిన వేడుక.. ‘బంగారు తామర’ బహూకరించిన సుబ్బరామిరెడ్డి సతీమణి


ప్రముఖ నటుడు మోహన్ బాబు ఈ రోజు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. తిరుపతిలోని విద్యానికేతన్ పాఠశాలలో మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు కొత్త సినిమా ‘ఆచారి అమెరికా యాత్ర’ షూటింగును కూడా ఈ రోజే ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మోహన్ బాబు, ప్రముఖ నిర్మాత టి. సుబ్బరామిరెడ్డి, ఆయన సతీమణి ఇందిర తదితరులు హాజరయ్యారు. సుబ్బరామిరెడ్డి సతీమణి ఇందిర ఈ సందర్భంగా మోహన్ బాబుకు బంగారు తామర పువ్వు అందజేశారు.

కాగా, మోహన్ బాబుకు శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయన అభిమానులు అధిక సంఖ్యలో అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ, తన అభిమానులు చల్లగా ఉండాలని, వారి కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని షిర్డీ సాయిబాబాను కోరుకుంటున్నానని అన్నారు. ‘ఆచారి అమెరికా యాత్ర’ టైటిల్ ఎవరినీ కించ పరిచే విధంగా లేదని, కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమని అన్నారు.

  • Loading...

More Telugu News