: హైదరాబాద్ ఆర్మీ క్వార్టర్స్ లో జవాన్ ఆత్మహత్య


హైదరాబాద్ లోని తిరుమల గిరిలో ఉన్న ఆర్మీ క్వార్టర్స్ లో ఓ జవాన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ రోజు తెల్లవారుజామున క్వార్టర్స్ సమీపంలోని మర్రి చెట్టుకు ఉరి వేసుకుని సందీప్ (34) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యూపీకి చెందిన సందీప్ భార్య, ఇతర కుటుంబ సభ్యులు ఆ రాష్ట్రంలోనే ఉంటున్నారని పోలీసులు చెప్పారు. సందీప్ మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

  • Loading...

More Telugu News