: సీఎం ఆదిత్యనాథ్ తో నాకు సమస్యలు లేవు: డిప్యూటీ సీఎం మౌర్య
ఉత్తరప్రదేశ్ కొత్త సీఎం యోగి ఆదిత్యనాథ్ తో తనకు ఎటువంటి సమస్యలు లేవని యూపీ డిప్యూటీ సీఎం, యూపీ బీజేపీ అధ్యక్షుడు కేశవ ప్రసాద్ మౌర్య స్పష్టం చేశారు. కాగా, యూపీ సీఎంగా కేశవ ప్రసాద్ మౌర్యని నియమిస్తారనే వార్తలు హల్ చల్ చేశాయి. అయితే, ఆ ఉత్కంఠకు తెర దింపుతూ యోగి ఆదిత్యనాథ్ ను సీఎంగా నియమించారు. ఈ నేపథ్యంలో కేశవప్రసాద్ మౌర్య ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ, తన బాధ్యతలు సక్రమంగా నెరవేరుస్తానని చెప్పి తనను డిప్యూటీ సీఎంగా నియమించారని అన్నారు. తామంతా కలిసి శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామని చెప్పారు.