: లక్నో చేరుకున్న ప్రధాని మోదీ


ఉత్తరప్రదేశ్ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ మరి కొంచెం సేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ తదితరులు లక్నో చేరుకున్నారు. లక్నో విమానాశ్రయంలో మోదీకి ఘన స్వాగతం పలికారు. ఆయనకు స్వాగతం పలికేందుకు యోగి ఆదిత్యనాథ్ కూడా వెళ్లారు. అక్కడి నుంచి నేరుగా ప్రమాణ స్వీకార మహోత్సవ వేదిక వద్దకు వెళ్లారు. కాగా, బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, ఉమా భారతి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తదితరులు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు.

  • Loading...

More Telugu News