: యోగి ఆదిత్యనాథ్ కు మద్దతుగా ముస్లింల భారీ ర్యాలీ


కొంచెం సేపట్లో ఉత్తరప్రదేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న యోగి ఆదిత్యనాథ్ కు ముస్లింలు మద్దతు పలికారు. గోరఖ్ పూర్ లో ఈ రోజు ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. హిందువులను, ముస్లింలను ఒకేలా చూస్తారని, హిందూ మతాన్ని ఎంత గౌరవిస్తారో, ముస్లిం సమాజాన్ని కూడా ఆయన అంతే గౌరవిస్తారని ఈ ర్యాలీలో పాల్గొన్న ముస్లిం యువత అన్నారు. సీఎంగా ఆయన ఎంపిక కావడాన్ని కొన్ని రాజకీయ పార్టీలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. హిందూ, ముస్లింల మధ్య యోగి ఆదిత్యనాథ్ ఎలాంటి భేదభావాలు చూపరని, ఆయనపై ముస్లిం వ్యతిరేకిగా ముద్రవేయడం తప్పు అని ర్యాలీలో పాల్గొన్న వారు విపక్షాలకు హితవు పలికారు. 

  • Loading...

More Telugu News