: సహ హాస్యనటుడిపై చేయి చేసుకున్న కపిల్ శర్మ
‘ద కపిల్ శర్మ షో’లో సహ హాస్యనటుడు సునిల్ గ్రోవర్ పై కపిల్ శర్మ చేయి చేసుకున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. గత గురువారం వీళ్లిద్దరూ ఆస్ట్రేలియా నుంచి ముంబయి వస్తుండగా విమానంలో ఈ సంఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ‘ద కపిల్ శర్మ షో’ నిమిత్తం కపిల్ తన బృందంతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి వస్తున్నప్పుడు విమానంలో కపిల్, సునిల్ మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అందరూ చూస్తుండగానే సునిల్ తో కపిల్ అసభ్యంగా మాట్లాడి, అతనిపై దాడి చేశాడు.
బాగా మద్యం సేవించి ఉన్న కపిల్ కేకలు వేస్తుండటంతో విమాన సిబ్బంది అతని చేతులు కట్టేసి సీటులో కూర్చోబెట్టాల్సి వచ్చింది. సునిల్ తన పనిలో తానుండగా కపిల్ దాడి చేశాడని, అందరు చూస్తుండటాన్ని గమనించిన సునిల్ సైలెంట్ గా ఉండిపోయాడని తోటి ప్రయాణికులు మీడియాకు తెలిపారు. కాగా, కపిల్, సునిల్ లు మంచి మిత్రులు. ‘కామెడి నైట్స్ విత్ కపిల్ షో’తో వాళ్లిద్దరూ మంచి పేరు సంపాదించుకున్నారు.