: వీఐపీలతో కిటకిటలాడిన తిరుమల... దర్శనానికి పోటెత్తిన ప్రముఖులు... సెల్ఫీలకు ఎగబడ్డ భక్తులు


నిత్యమూ సాధారణ భక్తులతో కిటకిటలాడే తిరుమల గిరులు నేడు వీఐపీలతో నిండిపోయాయి. ఈ ఉదయం బ్రేక్ దర్శన సమయంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు స్వామి వారిని సందర్శించుకున్నారు. ఏపీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి, మాజీ మంత్రులు సుబ్బరామిరెడ్డి, పనబాక లక్ష్మి, టీటీడీ బోర్డు సభ్యుడు రాఘవేంద్రరావు, సినీ ప్రముఖులు అశ్వనీదత్, ఇళయరాజా, సోనూ సూద్, మాజీ క్రికెటర్ చాముండేశ్వరీనాథ్ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రొటోకాల్ నిబంధనల ప్రకారం స్వాగతం పలికి, దర్శనం చేయించి, తీర్థ ప్రసాదాలను అందించారు. సోనూసూద్, ఇళయరాజా, రాఘవేంద్రరావులతో సెల్ఫీలు తీసుకునేందుకు భక్తులు పోటీపడ్డారు.

  • Loading...

More Telugu News