: లక్నో బయలుదేరిన చంద్రబాబునాయుడు


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఉదయం యూపీ రాజధాని లక్నోకు బయలుదేరారు. యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ నేడు ప్రమాణ స్వీకారం చేయనుండగా, ఆ వేడుకకు హాజరు కావాలని చంద్రబాబు నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్వయంగా బాబుకు ఫోన్ చేసి ఆహ్వానించగా, లక్నో వెళ్లేందుకు బాబు సమ్మతిని తెలిపారు. బడ్జెట్ సమవేశాలతో బిజీబిజీగా ఉన్నప్పటికీ, కాస్తంత వెసులుబాటు చేసుకుని ఆయన ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని భావించారు. కాగా, ఇటీవలి కాలంలో మరో ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపడుతున్న వేళ, చంద్రబాబు స్వయంగా హాజరు కావడం ఇదే మొదటిసారి. మధ్యాహ్నం 2:15 గంటలకు ప్రమాణ స్వీకారం అనంతరం స్వయంగా ఆదిత్యనాథ్ కు అభినందనలు తెలిపి, ఆపై తిరిగి హైదరాబాద్ కు చంద్రబాబు చేరుకుంటారని సమాచారం.

  • Loading...

More Telugu News