: పుజారా 150... 400 దాటిన భారత స్కోరు
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు నాలుగో రోజు ఆటలో, భారత ఆటగాళ్లు పుజారా, సాహాలు నిలదొక్కుకుని ఆడుతూ ఉండటంతో భారత తొలి ఇన్నింగ్స్ స్కోరు 400 పరుగుల మైలురాయిని దాటింది. ఈ క్రమంలో పుజారా తన 150 పరుగులను పూర్తి చేసుకున్నాడు. అతనికి తోడుగా మరో ఎండ్ లో ఆడుతున్న సాహా 38 పరుగులు చేసి హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు. మొత్తం 391 బంతులను ఎదుర్కొన్న పుజారా 18 ఫోర్ల సాయంతో 150 పరుగులు చేశాడు. సాహా 93 బంతుల్లో 41 పరుగులు చేశాడు. ప్రస్తుతం భారత స్కోరు 149 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 403 పరుగులు.