: దటీజ్ యోగి ఆదిత్యనాథ్... స్వీయ ప్రమాణ స్వీకార ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన వైనం!


నేడు యూపీ సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్న యోగి ఆదిత్యనాథ్, ఈ ఉదయం నిద్రలేచీ లేవగానే, తాను ప్రమాణ స్వీకారం చేసే స్మృతి వన్ ప్రాంతానికి వెళ్లి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులు, భారీ భద్రతా ఏర్పాట్ల నడుమ వేదిక వద్దకు వెళ్లిన ఆయన అక్కడంతా కలయదిరిగి తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా, పలువురు నేతలు, వివిధ రాష్ట్రాల సీఎంలు హాజరు కానున్నందునే, ఏ ఇబ్బందులూ కలుగకుండా చూసేందుకు తాను పరిశీలనకు వచ్చినట్టు ఆయన వెల్లడించడం గమనార్హం. కాగా, నేడు మధ్యాహ్నం 2:15 గంటలకు ఆయన సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News