: వాట్సాప్‌లో హల్‌చల్ చేస్తున్న జయ వీలునామా.. అందులో ‘అమ్మ’ ఏమని రాశారంటే..!


దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కుమారుడినంటూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన కృష్ణమూర్తి తాజాగా విడుదల చేసిన దస్తావేజు వాట్సాప్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈరోడ్ జిల్లాకు చెందిన కృష్ణమూర్తి తాను జయలలిత కుమారుడినంటూ కోర్టులో పిటిషన్ వేశారు. అయితే అందుకు  సంబంధించిన రుజువులను చెన్నై పోలీస్ కమిషనర్‌కు అప్పగించాలని కోర్టు  ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆయన తన వద్ద ఉన్న దస్తావేజు పత్రాలను సామాజిక మాధ్యమం వాట్సాప్‌లో పోస్టు చేశారు. జయలలిత రాసినట్టుగా ఉన్న ఆ పత్రాల్లోని  సారాంశం..

తాను తెలుగు సినిమాల్లో నటించే సమయంలో హీరో శోభన్ బాబును ప్రేమించానని, 1982లో అతడిని వివాహం చేసుకున్నానని జయలలిత అందులో పేర్కొన్నారు. ఫిబ్రవరి 15, 1985న ఇంట్లోనే బాబుకు జన్మనిచ్చినట్టు తెలిపారు. ఎంజీఆర్ అప్పుడప్పుడు తనను చూసేందుకు వచ్చేవారని, దీనివల్ల శోభన్‌బాబుతో తనకు మనస్పర్థలు వచ్చాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇద్దరం విడిపోయి జీవించాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. బాబును తాను పెంచుకుంటానంటే సరే అన్నారని, ఆ బిడ్డ తన వారసుడని చెప్పారని అందులో పేర్కొన్నారు. తర్వాత ఓ సినిమా షూటింగ్‌లో పరిచయమైన ముత్తుచ్చు ఉండ్లీపాళయంకు చెందిన స్నేహితురాలు వసంతమణికి తన బిడ్డను ఇచ్చి పెంచి పెద్ద చేసి ఇవ్వాలని కోరామని ఆ వీలునామాలో పేర్కొన్నారు.  ‘‘నా భర్త శోభన్‌బాబు, నేను మనస్ఫూర్తిగా రాస్తున్న వీలునామా ఇది’’ అని అందులో ఉంది.

  • Loading...

More Telugu News