: హ్యూస్టన్ పీడబ్ల్యూడీ డైరెక్టర్‌గా హైదరాబాదీ.. ఈ పదవికి ఎంపికైన తొలి ఆసియా వాసి
అమెరికాలో భారతీయుడుకి మరో అరుదైన గౌరవం లభించింది. హైదరాబాద్‌కు చెందిన కరుణ్ శ్రీరామ్ (53) హ్యూస్టన్ ప్రజాపనులు, ఇంజినీరింగ్ విభాగం (పీడబ్ల్యూడీ) డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఏప్రిల్ 3న ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఈమేరకు మేయర్ సిల్విస్టర్ టర్నర్ ఆదేశాలు జారీ చేశారు. అమెరికాలో పలు ప్రాజెక్టులు చేపట్టిన శ్రీరామ్‌కు ఈ రంగంలో దాదాపు మూడు దశాబ్దాల అనుభవం ఉంది. హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సివిల్ ఇంజినీరింగ్ చదువుకున్న శ్రీరామ్ ఈ పదవికి ఎంపికైన తొలి ఆసియన్‌గా రికార్డు సృష్టించారు.