: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్‌కు టీచింగ్ అంటే ఎంతో ఇష్టమట!


ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు టీచింగ్ అంటే ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. భవిష్యత్తులో విద్యారంగంలోకి అడ్డుపెట్టే ఆలోచన ఉందంటూ సూచనప్రాయంగా తెలిపారు. తండ్రి తనను రిలయన్స్‌లోకి తీసుకురాకుండా ఉండుంటే అమెరికాలోని యూనివర్సిటీలో చదువుకుని వరల్డ్‌ బ్యాంకులో పనిచేస్తూనో, లేదంటే అధ్యాపకుడిగానో ఉండేవాడినని పేర్కొన్నారు. విద్యారంగంలోకి రావాలనుకుంటున్నది ఆత్మసంతృప్తి కోసమేనని ముఖేశ్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News