: మధ్య వేలు కట్ కావడమే ఆస్ట్రేలియా బౌలర్ కమిన్స్ కు వరం!


బ్యాట్స్ మేన్ కు దడ పుట్టించే ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ కమిన్స్ బౌలింగ్ కిటుకు తెలిసిపోయింది. చిన్న వయసులో అతని సోదరి అకస్మాత్తుగా తలుపు వేయడంతో, మధ్య వేలు, తలుపు సందుల్లో ఇరుక్కుని నుజ్జునుజ్జుకాగా, వేలిలో కొంతభాగాన్ని తొలగించారు. సాధారణంగా చూపుడు వేలితో పోలిస్తే, మధ్య వేలు పొడవుగా ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఘటనతో కమిన్స్ చూపుడు, మధ్య వేలి పొడవు ఒకేలా ఉంటుంది. దీని కారణంగానే బంతిపై గ్రిప్, సీమ్ చక్కగా వస్తోందని, ఆసీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ వ్యాఖ్యానించాడు. అతని వేలు సెంటీమీటర్ మేరకు తెగిపోవడం అతనికి వరమైందని అన్నాడు.

  • Loading...

More Telugu News