: అఫ్రిదికి అరుదైన గౌరవం.. అంధుల ప్రపంచకప్ ప్రచారకర్తగా నియామకం
పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదికి అరుదైన గౌరవం దక్కింది. వచ్చే ఏడాది జరగనున్న అంధుల ప్రపంచకప్ ప్రచారకర్తగా ఆఫ్రిదిని నియమిస్తూ పాకిస్థాన్ బ్లైండ్ క్రికెట్ కౌన్సిల్ (పీబీసీసీ) నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్-యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) సంయుక్త భాగస్వామ్యంలో వచ్చే ఏడాది జనవరిలో అంధుల ప్రపంచకప్ క్రికెట్ పోటీలు నిర్వహించనున్నారు. అఫ్రిది తన ఆట తీరుతో ఎందరికో స్ఫూర్తి నిచ్చాడని, అడిని ప్రచారకర్తగా ఎంపిక చేయడాన్ని అరుదైన ఘనతగా భావిస్తున్నామని పీబీసీసీ చైర్మన్ సయ్యద్ సుల్తాన్ షా పేర్కొన్నారు. వరల్డ్‌కప్‌లో భాగంగా స్వదేశంలో కొన్ని పూల్ మ్యాచ్‌లతోపాటు ఫైనల్‌ను నిర్వహించాలని పాక్ యోచిస్తోంది. కాగా, ప్రపంచకప్ టోర్నీలో పాల్గొననున్న తొమ్మిది మంది సభ్యులు గల వరల్డ్ బ్లైండ్ క్రికెట్ లిమిటెడ్ జట్టులో నలుగురు మాత్రమే పాక్‌లో ఆడేందుకు అంగీకరించారు.