: రవి ప్రకాశ్ గారూ! మీరంటే నాకు అస్సలు ఇష్టం ఉండేది కాదు: బండ్ల గణేష్
'టీవీ9 రవిప్రకాశ్ గారూ, మీరంటే నాకు అస్సలు ఇష్టం ఉండేది కాదు' అంటూ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ అనగానే పవన్ కల్యాణ్ నెత్తిపట్టుకున్నాడు. అంతకు ముందే రవి ప్రకాశ్ తనకు పవన్ కల్యాణ్ అంటే ఇష్టం అంటూ చెప్పడంతో వేదిక దిగిన అనంతరం కౌగిలించుకుని మాట్లాడిన పవన్... తన పక్కనే రవి ప్రకాశ్ ను కూర్చోబెట్టుకున్నారు. ఆయన కూర్చున్న రెండో నిమిషానికే బండ్ల గణేష్ అలా అనడంతో రవి ప్రకాశ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ ముగ్గురూ నెత్తిపట్టుకుని నవ్వుకున్నారు.
అంతలోనే మళ్లీ అందుకున్న బండ్ల గణేష్... ఇంత వరకు మీరంటే ఇష్టం లేకనే... నేను ఏనాడూ మిమ్మల్ని కలవలేదు. ఏదైనా పని పడితే నరేంద్ర చౌదరిగారినే కలిశాను... కానీ ఈ రోజు మీరు నాకు నచ్చారు. ఇంతవరకు మీరు నాకు నచ్చలేదు.. దానిని క్షమించండి' అన్నాడు. 'దానికి కారణం ఏంటంటే.. మీలో కూడా మా దేవుడు పవన్ కల్యాణ్ లక్షణాలే ఉన్నాయని' బండ్ల గణేష్ అనడంతో అంతా నవ్వేశారు.