: గాంధీ ఘటనలో ఇద్దరిపై చర్యలు తీసుకున్న సూపరిండెంట్!


హైదరాబాదులోని పెద్దాసుపత్రిగా పేరొందిన గాంధీ ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఘటనలో మంత్రి కేటీఆర్ స్పందించడంతో ఆసుపత్రి సూపరిండెంట్ ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగులపై చర్యలు తీసుకున్నారు. నిన్న గాంధీ ఆసుపత్రిలో నడవలేకపోతున్న రోగిని ఆసుపత్రి లోపలికి తీసుకెళ్లేందుకు ఉద్యోగులు 150 రూపాయలు లంచం డిమాండ్ చేయగా, అవి ఇచ్చుకోలేని వ్యక్తి తన కుమారుడు ఆడుకునే బొమ్మ స్కూటర్ పై భార్య సహకారంతో వైద్యుడి వద్దకు వెళ్లాడు.

దీనిని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఇది వైరల్ అయింది. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ రోగి వివరాలు తనకు చెప్పాలంటూ ట్వీట్ చేశారు. దీంతో వివరాలు అందుకున్న కేటీఆర్ గాంధీ ఆసుపత్రి సూపరిండెంట్ ను నిలదీయడంతో కదిలిన అధికారులు. ఈ ఘటనకు కారణమైన ఆసుపత్రి సిబ్బందిని గుర్తించి, కాంట్రాక్టు కార్మికులుగా విధులు నిర్వర్తిస్తున్న పి.వెంకటరత్నం, ఎస్.మహేంద్ర భాయిని సస్పెండ్ చేశారు. 

  • Loading...

More Telugu News