: యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాధ్ ఖరారు!


ఉత్తరప్రదేశ్ రాష్ట్ర శాసనసభాపక్ష సమావేశం ముగిసింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో భారీ ఆధిక్యంతో విజయం సాధించిన బీజేపీ...ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు మల్లగుల్లాలు పడింది. నేటి మధ్యాహ్నం వరకు బీజేపీ సీనియర్ నేతలంతా రేసులో ఉన్నారంటూ పలువురి పేర్లు మీడియాలో హల్ చల్ చేశాయి. దీంతో యూపీ బీజేపీ చీఫ్ కేశవ్ ప్రసాద్ మౌర్య ఎవరి పేరు చెబితే వారినే సీఎంగా ప్రకటిస్తానంటూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పలువురు సీనియర్ నాయకులతో చర్చించిన అమిత్ షా ఎట్టకేలకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆ పార్టీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ ను ప్రకటించారు. యోగి ఆదిత్య నాథ్ ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎంపీగా విజయం సాధించారు. పలు వివాదాస్పద వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా ఖ్యాతి తెచ్చుకున్న యోగి ఆదిత్యనాథ్ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టనున్నారు. రేపు ఆయన ప్రమాణ స్వీకారం జరగనుంది. 

  • Loading...

More Telugu News