: క్రికెట్ లో ఫిక్సింగ్ కు పాల్పడితే ఉరిశిక్ష విధించాలి: దావూద్ ఇబ్రహీం వియ్యంకుడి డిమాండ్
క్రికెట్ లో గతంలో ఫిక్సింగ్ ఉండేది. దాని స్థానంలో స్పాట్ ఫిక్సింగ్ కొత్తగా వచ్చి చేరింది. ఈ స్పాట్ ఫిక్సింగ్ లో పాకిస్థాన్ ఆటగాళ్లు విరివిగా చిక్కుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ దిగ్గజ మాజీ ఆటగాడు, అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం వియ్యంకుడు జావెద్ మియాందాద్ మాట్లాడుతూ, ఫిక్సింగ్ కు పాల్పడ్డవారిని ఉరి తీయాలని అన్నాడు. పాకిస్థాన్ క్రికెట్ లో చోటుచేసుకుంటున్న స్పాట్ ఫిక్సింగ్ కు శాశ్వత పరిష్కారం గురించి ఎందుకు ఆలోచించడం లేదని ప్రశ్నించాడు. బోర్డు అధికారులు కఠిన శిక్షలు విధిస్తే ఫిక్సింగ్ భూతాన్ని తరిమికొట్టవచ్చని సూచించాడు. కఠిన శిక్షలు అమలు చేయకుండా ఫిక్సింగ్ జాడ్యం క్రికెట్ ను వీడిపోదని మియాందాద్ తెలిపాడు.