: సంజయ్ దత్ జైలులో రాసిన ఆ పాటను సినిమాలో వినిపించనున్నారట!
బాలీవుడ్ దర్శకుడు గిరిష్ మాలిక్ దర్శకత్వంలో వస్తున్న ‘తోర్బాజ్’ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఆర్మీ అధికారి పాత్రలో నటించనున్నాడు. విశేషం ఏమిటంటే, ఆ సినిమాలో సంజయ్ దత్ రాసిన ఓ పాట కూడా ఉందట. ఈ పాటను సంజయ్ దత్ ఎక్కడ రాశాడో తెలుసా? ఎరవాడ జైలులో వున్నప్పుడు రాశాడు. అక్రమాయుధాల కేసులో ఆయన ఇన్నాళ్లు జైలు శిక్ష అనుభవించిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే ఆయన జైలులో కూర్చొని ఈ పాటను రాసుకున్నారట.
ఆ పాటనే చైల్డ్ సోల్జర్స్ థీమ్‌తో తెరకెక్కించనున్న ఈ సినిమాలో ఉపయోగిస్తున్నారు. ‘ఓ మేరీ ఆంగన్ కీ చిదియా హై తూ’.. అంటూ సంజయ్ రాసిన ఈ పాటను విన్న నిర్మాత రాహుల్ మిత్రా ఈ పాటకు మంత్రముగ్ధుడయ్యాడు. తండ్రీకూతుళ్ల మధ్య అనుబంధాన్ని తెలియజేసేలా ఈ పాట ఉందని, ఈ సినిమాలో పెడదామని ఆయన అన్నారు.