: అమెరికాలో భారతీయులపై జరుగుతున్న దాడులపై మోదీకి కేసీఆర్ లేఖ


అమెరికా అధ్య‌క్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్ర‌మాణ స్వీకారం చేసిన త‌రువాత ఆ దేశంలో భార‌తీయుల‌పై వ‌రుస దాడులు జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యంపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ రోజు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ విష‌యాన్ని అమెరికా గ‌వ‌ర్న‌మెంటు దృష్టికి తీసుకెళ్లి మ‌ళ్లీ ఇటువంటి దాడులు జ‌ర‌గ‌కుండా చూడాలని ఆయ‌న కోరారు. ఇటీవ‌లే హైదరాబాద్‌కు చెందిన కూచిభొట్ల శ్రీనివాస్‌, వరంగల్ జిల్లాకు చెందిన మామిడాల వంశీచంద్‌రెడ్డి అమెరికాలోని వేర్వేరు ప్రాంతాల్లో హత్యకు గుర‌యిన విష‌యాన్ని ఆయ‌న ప్ర‌స్తావిస్తూ ఇటువంటి ఘ‌ట‌న‌లు ఎంతో దురదృష్టకరమ‌ని అన్నారు.

  • Loading...

More Telugu News