: ‘బాహుబలి’ సినిమాలో ఆ పాత్ర గురించి రాజమౌళితో మాట్లాడాను.. బాగా నవ్వేశారు: తాగుబోతు రమేష్‌!


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇటీవ‌ల ప్రకటించిన నంది అవార్డుల జాబితాలో ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ సినిమాకుగానూ ఉత్త‌మ హాస్య‌న‌టుడిగా తాగుబోతు ర‌మేష్ నిలిచిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ... రాజ‌మౌళి తీసిన‌ బాహుబ‌లి-1 గురించి మాట్లాడాడు. బాహుబ‌లి క‌న్నా ముందు రాజ‌మౌళి తీసిన ఈగ సినిమాలో తాగుబోతు ర‌మేష్ న‌టించారు. ఈ సినిమాలో క‌నిపించిన ఏకైక క‌మెడియ‌న్ తానేన‌ని ఆయ‌న అన్నాడు. అందులో త‌న‌పై మ‌రిన్ని సీన్లు తీసిన‌ప్ప‌టికీ వాటిలో కొన్నింటిని ఎడిటింగ్‌లో తీసేశారని చెప్పారు. అయితే, అనంత‌రం రాజమౌళి ‘బాహుబలి-1’ తీశార‌ని, తాజాగా బాహుబ‌లి-2 సెట్‌లో తాను రాజ‌మౌళిని క‌లిసి స‌ర‌దాగా మాట్లాడాన‌ని అన్నాడు.

‘బాహుబలి-1’ సినిమాలో నేను చేయాల్సిన క్యారెక్టర్‌ను మీరు చేసేశారండి అని తాను రాజ‌మౌళితో అన్నాన‌ని రమేష్ చెప్పాడు. (‘బాహుబలి-1’ సినిమాలో క‌ల్లు  దుకాణంలో క‌ల్లు అమ్మే వ్య‌క్తిగా రాజమౌళి కనబడతారన్న విషయం తెలిసిందే). ఆ పాత్ర త‌న‌కు ఇవ్వాల్సిందని తాను రాజ‌మౌళితో అన్నాన‌ని పేర్కొన్నాడు. అలా అన‌గానే రాజ‌మౌళి పెద్దగా నవ్వేశారని ఆయన తెలిపాడు.

  • Loading...

More Telugu News