: చంద్రబాబు నివాసం వద్ద కొండచిలువ కలకలం


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద ఓ కొండచిలువ కలకలం రేపింది. ప్రకాశం బ్యారేజీ కరకట్ట నుంచి ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లే మార్గంలో ఈ కొండచిలువను ఆయన భద్రతా సిబ్బంది గుర్తించారు. జడ్ ప్లస్ సెక్యూరిటీ మధ్య ఉండే చంద్రబాబు ప్రయాణించే మార్గంలో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ లు తనిఖీ చేస్తుంటాయి. ఈ ఉదయం కూడా కరకట్టకు ఇరువైపులా తనిఖీలు నిర్వహిస్తుండగా ఆరడుగుల కొండచిలువను గుర్తించారు. వెంటనే అటవీశాఖకు సమాచారం అందించారు. అటవీశాఖ సిబ్బంది వచ్చి, కొండచిలువను పట్టుకుని, మంగళగిరి కొండప్రాంతంలో వదిలేశారు. ఇదే మార్గంలో 10 అడుగుల పొడవున్న మరో కొండచిలువ కూడా తిరుగుతోందని స్థానికులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News