: తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడున్నవారంతా బిజ్జల దేవుళ్లే: పువ్వాడ అజయ్


తెలంగాణ రాజకీయాల్లో బాహుబలి ఫీవర్ నడుస్తోంది. కాంగ్రెస్ ను గెలిపించేందుకు బాహుబలి వస్తాడని శాసనసభలో ప్రతిపక్ష నేత జానారెడ్డి పేర్కోవడంతో రాజకీయ నాయకులను బాహుబలి ఫీవర్ పట్టుకుంది. తాజాగా ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ అసెంబ్లీ లాబీల్లో మాట్లాడుతూ, తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడున్నవారంతా బిజ్జల దేవుళ్లేనని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎదుర్కొనే నేత తమ పార్టీలో లేరని సాక్షాత్తూ ఆ పార్టీ నేతలే అంగీకరించారని ఆయన చెప్పారు. కాంగ్రెస్ లో బాహుబలి ఎవరూ లేరని ఏడాది క్రితమే తేలిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. 

  • Loading...

More Telugu News