: నేను తిరుపతిలో ఎకనామిక్స్ చదివాను... మీరెక్కడ చదివారు?: విపక్షానికి చంద్రబాబు ప్రశ్న


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విపక్షాలకు చురకలంటించారు. ప్రత్యేకహోదా వస్తే రాయితీలు వస్తాయన్న విపక్షాల ప్రచారంపై గుంటూరు జిల్లా గొల్లపాడులో నిర్వహించిన విద్యార్థులతో ముఖాముఖిలో ఆయన మాట్లాడుతూ, ప్రతిపక్షం ప్రత్యేకహోదాపై తప్పుడు ప్రచారం చేస్తోందని అన్నారు. తాను తిరుపతిలోని ఎస్వీ యూనివర్శిటీలో ఎకనమిక్స్ చదివానని అన్నారు. మరి ప్రతిపక్ష నేతలు ఎక్కడ చదివారో, ఏం చదివారో తనకు తెలియదని ఆయన పేర్కొన్నారు. అసలు ఏ రూల్స్ కింద ఇండస్ట్రీస్ ఇన్‌‌సెంటివ్స్ వస్తాయో చెప్పమని ప్రతిపక్షాన్ని చాలాసార్లు అడిగానని, వారు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటున్నారని ఆయన అన్నారు. ఇప్పటికైనా ఏ నిబంధనల ప్రకారం స్పెషల్ ఇన్సెంటివ్స్ వస్తాయో చెబితే...వాటి కోసం తాను పోరాడుతానని ఆయన సూచించారు. 

  • Loading...

More Telugu News