: నడి రోడ్డు మీద అలా చేయడం తప్పే ..క్షమించండి!: ముస్లిం మతపెద్దలను వేడుకుంటున్న యువకుడు


సినీ తరహాలో ప్రేమను వ్యక్తం చేసిన ఓ యువకుడు ఇప్పుడు తీవ్ర హెచ్చరికలు ఎదుర్కొంటున్న ఘటన మహారాష్ట్రలోని భివాండీలో చోటుచేసుకుంది. హత్య చేస్తామంటూ మతోన్మాదులు బెదిరింపులకు దిగడంతో ఆ కుటుంబం బెంబేలెత్తిపోతోంది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... భివాండీలో ఈ నెల 11న ఉదయం రద్దీగా ఉన్న రోడ్డులో కారులో వచ్చిన ఓ యువకుడు నడి రోడ్డుపై బుర్ఖా ధరించిన యువతికి ప్రేమను వ్యక్తీకరించాడు. దీనిని అటుగా వెళ్తున్న వ్యక్తి తన ఫోన్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. ఇది ముస్లిం మతపెద్దల ఆగ్రహానికి కారణమైంది. వారి తీరు మతాచారాలకు విరుద్ధంగా ఉందని పేర్కొంటూ పలువురు ప్రదర్శనలు చేస్తామని చెబుతుండగా, యువతి తండ్రి మాత్రం తమ కుటుంబానికి హాని తలపెడతామంటూ పలువురు ఫోన్లు చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఫోన్లపై బెంబేలెత్తిపోయిన యువతి తన కుటుంబానికి బెదిరింపులు చేస్తే ఆత్మహత్యే శరణ్యమని చెబుతోంది. దీనిపై ఆ యువతి ప్రియుడు స్పందిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. తాను చేసింది మతాచారానికి విరుద్ధమేనని తెలిపాడు. తనను క్షమించాలని కోరాడు. దీనిపై స్పందించిన పోలీసులు, యువకుడి కుటుంబానికి రక్షణ ఇస్తామని తెలిపారు. వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎవరైనా వారిపై బెదిరింపులకు దిగితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

  • Loading...

More Telugu News