: పూరీ జగన్నాథ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన హేమ!


తెలుగు సినీ పరిశ్రమలో దాదాపు 25 ఏళ్ల నుంచి నటిస్తూ, ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసింది నటి హేమ. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) కార్యకలాపాల్లో కూడా చురుకుగా పాల్గొంటుంది. తాజాగా ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ పై ఆమె విమర్శలు గుప్పించింది. తెలుగు సినీ పరిశ్రమలో తెలుగు వారికి అవకాశాలు తక్కువగా దక్కుతున్నాయని... పూరీ జగన్నాథ్ కూడా ఎక్కడి వాళ్లనో తీసుకొచ్చి అవకాశాలు ఇస్తున్నాడంటూ విమర్శించింది. తనకు తల్లి పాత్రలు ఎందుకు ఇవ్వడంటూ పూరీని ఆమె ప్రశ్నించింది. ఎన్టీఆర్ కు తల్లిగా నటించే స్థాయి తనకు లేదా? అని నిలదీసింది.

మరోవైపు, సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ సంస్కృతి గురించి మాట్లాడుతున్న హీరోయిన్లపై హేమ మండిపడింది. ఈ ఆరోపణలు చేస్తున్న హీరోయిన్లంతా... గత సినిమాల పేర్లు చెప్పుకునే ఇప్పటికీ బతుకుతున్నారని చెప్పింది. ఇప్పుడు అవకాశాలు రాకపోవడంతో, విమర్శలు చేస్తున్నారని విమర్శించింది. ఒకవేళ ఈ పరిశ్రమ చెడ్డదైతే... హీరోలు, నిర్మాతలు, దర్శకులు వాళ్ల పిల్లలను ఈ పరిశ్రమలోకి ఎందుకు తీసుకొస్తారని ప్రశ్నించింది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత అనర్థాలు పెరిగిపోయాయని తెలిపింది.

  • Loading...

More Telugu News