: టీమిండియా బ్యాట్స్ మెన్ విజయ్ ఖాతాలో అరుదైన చెత్త రికార్డు!
రాంచీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్లో టీమిండియా ఓపెనర్ విజయ్ 82 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయిన విషయం తెలిసిందే. మూడో రోజు మొదటి సెషన్ పూర్తవడానికి ముందు ఆయన ఔట్ కావడంతో ఆయన ఖాతాలోకి ఓ చెత్త రికార్డు వచ్చి పడింది. ఇప్పటి వరకు ఆయన ఆడిన టెస్టు మ్యాచుల్లో సెషన్ ప్రారంభంలోగానీ, ముగింపునకు ముందుగానీ అవుటవడం ఇది 12వ సారి కావడంతో.. అలా అవుటయిన వారిలో విజయ్ మొదటిస్థానంలో నిలిచాడు.