: సంద‌డి చేసిన యాంకర్లు అనసూయ, శ్రీముఖి, రెష్మీ, ప్రదీప్, రవి.. ఫేస్ బుక్ లో ఫొటోలు!


బుల్లితెర‌పై యాంక‌రింగ్‌తో అద‌ర‌గొడుతూ దూసుకుపోతున్న యాంక‌ర్లు అనసూయ, రేష్మీ, ప్రదీప్, శ్రీముఖి, రవిలు ఒకే చోట కలిశారు. ఈ సంద‌ర్భంగా స‌ర‌దాగా క‌బుర్లు చెప్పుకొని సెల్ఫీలు, ఫొటోల‌కు పోజులిచ్చారు. ఇందుకు సంబంధించి ఫొటోలను అన‌సూయ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ సంద‌ర్భంగా అన‌సూయ‌.. తన తోటి యాంక‌ర్ల‌ ఎదుగుదలను చూసి తనకు అసూయ ఉండదని పేర్కొంది. తాము ఒకరికొకరు స్ఫూర్తిగా నిలుస్తూ సామర్థ్యానికి తగ్గట్టు ప్రతిభ కనబరిచేలా సాయం చేసుకుంటామని చెప్పింది. త‌న‌ పనితీరుతో పాటూ, తన సహచర యాంకర్ల పనితీరును చూసి కూడా తాను గర్వపడుతున్నానని పేర్కొంది.


  • Loading...

More Telugu News