: జయలలిత మేనకోడలు దీపకు షాక్ ఇచ్చిన ఆమె భర్త!
తమిళనాడు దివంగత ముఖ్యమత్రి జయలలిత మేనకోడలు దీపకు ఆమె భర్త మాధవన్ షాక్ ఇచ్చారు. జయ మరణం తర్వాత దీప 'ఎంజీఆర్ అమ్మ దీప పెరవై' అనే రాజకీయ వేదికను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు, ఆర్కే నగర్ ఉపఎన్నికలో ఆమె పోటీ చేస్తున్నారు. అయితే, ఈ వేదిక విషయంలో దీపతో ఆమె భర్త విభేదించారు. దీప ఏర్పాటు చేసిన వేదికలో తాను కొనసాగనని ఆయన స్పష్టం చేశారు. నిన్న జయలలిత సమాధి వద్దకు వెళ్లి శ్రద్ధాంజలి ఘటించిన మాధవన్... మీడియాతో మాట్లాడుతూ, దీపను కొన్ని దుష్ట శక్తులు ప్రభావితం చేస్తున్నాయని ఆరోపించారు. తాను కూడా ఒక కొత్త పార్టీని నెలకొల్పబోతున్నట్టు ప్రకటించారు. తన భర్త మాధవన్ నిర్ణయంతో దీప షాక్ కు గురయ్యారు. ఆర్కే నగర్ నుంచి గెలిచి, జయ అసలుసిసలు రాజకీయ వారసురాలిని తానేనని నిరూపించుకునే సమయంలో... తన భర్త వ్యవహరించిన తీరు పట్ల ఆమె దిగ్భ్రాంతికి గురయ్యారు.