: కడప జిల్లాలో తొలిసారిగా వైఎస్ కుటుంబాన్ని ఓడించబోతున్నాం: టీడీపీ నేతల ధీమా
కడప జిల్లాలో తొలిసారిగా వైఎస్ కుటుంబాన్ని ఓడించబోతున్నామని టీడీపీ నేతలు సీఎం రమేష్, ఆదినారాయణ రెడ్డి, శ్రీనివాసులురెడ్డి ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధినేత జగన్ బాబాయి వివేకానందరెడ్డిపై తమ అభ్యర్థి బీటెక్ రవి విజయం సాధిస్తారని జోస్యం చెప్పారు. ఈ జిల్లాలో ఏకపక్ష కుటుంబ పాలనకు త్వరలోనే చరమగీతం పాడతామని అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అభ్యర్థి ఓడిపోతారనే భయంతోనే జగన్ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చారని ఎద్దేవా చేశారు. జిల్లాలో అభివృద్ధికి సంబంధించి ఎన్నో సమావేశాలు ఇప్పటి వరకు నిర్వహించారని, ఏ ఒక్క సమావేశానికి హాజరు కాని జగన్, తన బాబాయికు ఓటు వేసేందుకు మాత్రం ఇక్కడికి రావడం విడ్డూరంగా ఉందన్నారు.