: నాకు కేటీఆర్, జగన్ పోటీ కాదు... చంద్రబాబే పోటీ!: నారా లోకేష్
మంత్రి అయ్యాక ప్రతి విషయంలోను ఇతరులతో పోల్చి చూస్తారు, రేపు కేటీఆర్ తో పోల్చి చూస్తారు, దానిపై మీ అభిప్రాయం ఏంటి? అన్న ప్రశ్నకు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సరికొత్తగా స్పందించారు. తనకు కేటీఆర్ లేదా వైఎస్సార్సీపీ అధినేత జగన్ లతో పోటీ లేదని తెలిపారు. ఓ టీవీ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, తన పోటీ వేరెవరితోనో కాదని, తనకు కాంపిటిషన్ తన ఇంట్లోని ఉన్నారని, తన తండ్రే తనకు కాంపిటీషన్ అని లోకేష్ తెలిపారు.
ఉదయం నిద్ర లేచిన దగ్గర్నుంచి రాష్ట్రం, రాజధాని, ప్రజలు అన్న ఆలోచనలే తన తండ్రి మదిలో ఉంటాయని, అందుకు తగ్గట్టే ఆయన ప్రణాళిక రచించుకుంటారని, కార్యాచరణ కూడా అందుకు తగ్గట్టే ఉంటుందని ఆయన చెప్పారు. తన తండ్రిని ఆదర్శంగా తీసుకుని కష్టపడతానని, నిరంతరం ప్రజలకు సేవ చేస్తానని ఆయన అన్నారు.