: అప్పుడు, నేను ఉన్నట్టయితే ఇందిరాగాంధీ చుట్టూ తిరిగే దానిని!: నటి తాప్సి
దివంగత భారత ప్రధాని ఇందిరాగాంధీ అంటే తనకు ఎంతో అభిమానమని ప్రముఖ నటి తాప్సి చెప్పింది. శివమ్ నాయర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘నామ్ షబానా’ చిత్రంలో ఆమె ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న తాప్సి, మీడియాతో మాట్లాడుతూ, 1970లలో తాను కనుక ఉండి ఉంటే, ఇందిరాగాంధీ చుట్టూ తిరుగుతూ, ఆమెకు సంబంధించిన విషయాలను తెలుసుకుంటూ ఉండే దానినని చెప్పింది. ఇందిరాగాంధీ అంటే తనకు ఎంతో అభిమానమని, ఆమె జీవితంలోని ప్రతి సంఘటన గురించి ఓ పుస్తకం రాయాల్సిందేనని తాప్సి అభిప్రాయపడింది. కాగా, ఈ నెల 31న ‘నామ్ షబానా’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.