: తల్లిని కారులో తీసుకువెళుతున్న రాహుల్!
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ వైద్య పరీక్షల నిమిత్తం ఇటీవల విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రాహుల్ కూడా అమ్మకు తోడుగా వెళ్లారు. అయితే, వాళ్లిద్దరూ ఏ దేశం వెళ్ళారన్న విషయం మాత్రం బయటకు రాలేదు. అయితే, రాహుల్ స్వయంగా కారు నడుపుతూ తన తల్లిని తీసుకువెళుతున్న ఫొటో ఒకటి బయటకు వచ్చింది. ఈ ఫొటోను రాహుల్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. రాహుల్ డ్రైవ్ చేస్తుండగా, ఆయన పక్కనే సోనియా కూర్చుని ఉన్నారు. కాగా, సోనియా కేన్సర్చికిత్స నిమిత్తం గతంలో అమెరికాకు వెళ్లారు. ఈసారి కూడా ఆమె అక్కడికే వెళ్లి ఉంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.