: ప్రధాని మోదీలో అద్భుతమైన ఆ గుణం నాకు ఎంతగానో నచ్చింది: రాష్ట్రపతి ప్రణబ్


ఈ రోజు ముంబైలో జరిగిన 'ఇండియాటుడే కాంక్లేవ్' కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. ప్రధాని నరేంద్ర మోదీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏ విషయాన్నైనా త్వరగా నేర్చుకోవడంతో పాటు, ఏ అంశాన్ని అయినా త్వరగా పరిష్కరించగల నేర్పు ప్రధాని మోదీలో ఉందని, ఆ అద్భుతమైన గుణమే తనకు ఎంతగానో నచ్చిందని ప్రణబ్ కొనియాడారు. కేవలం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాత్రమే అనుభవం గడించిన మోదీ, ప్రధానిగా పార్లమెంటులో అడుగుపెట్టడం గొప్ప విషయమన్నారు. జీ-20 దేశాల సమావేశాల్లో, ఇతర దేశాలలో సత్సంబంధాలు మెరుగుపరచుకోవడంలో ప్రధాని వ్యవహరిస్తున్న తీరు ప్రశంసనీయమని ప్రణబ్ కితాబిచ్చారు. అయితే, ఎంతో విలువైన పార్లమెంట్ సమావేశాలను అనవసర విషయాలతో సభ్యులు పక్కదారి పట్టిస్తున్నారంటూ ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News