: ఆకర్షణ వెనుక అనారోగ్యం.. కలర్ ఫుల్ పాయిజన్.. లిప్ స్టిక్స్!


నిత్యం లిప్ స్టిక్స్ ఉపయోగించే అమ్మాయిలూ, మీకో చేదు నిజం !..లిప్ స్టిక్స్ ను రోజూ ఉపయోగించడమంటే ‘కలర్ ఫుల్ పాయిజన్’ను పెదాలకు పూసుకోవడమేని వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు, లిప్ స్టిక్స్ తో ‘ఆకర్షణ వెనుక అనారోగ్యం’ దాగి ఉందనీ అంటున్నారు. ఎందుకంటే, ఇందులో, పాయిజనస్ కెమికల్స్ ఉంటాయని, వీటిని వాడటం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. అందంగా ఉండటం కోసమని, అధరాలకు లిప్ స్టిక్స్ ను ఎక్కువ మోతాదులో వాడితే మరింత ప్రమాదమని చెబుతున్నారు.

చక్కనైన రంగు, గుబాళించే సువాసన కోసం లిప్ స్టిక్స్ లో అనేక రసాయనాలను వినియోగిస్తున్నారు. గాసీగా ఉండే లిప్ స్టిక్స్ లో హెవీ మెటల్స్ ఉంటాయని ఇటీవల ఓ సర్వేలో తేలింది. పరిమితికి మించి వీటిని వాడితే ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. రోజుకు పధ్నాలుగు నుంచి ఇరవై సార్లు కూడా లిప్ స్టిక్ రాసుకునే వారు ఉన్నారని, వారికి అనారోగ్య సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

ఊపిరితిత్తులు, కిడ్నీలు, చర్మం దెబ్బతినడమే కాకుండా కాలక్రమంలో నరాల బలహీనత, పెదాలకు, చర్మానికి సంబంధించిన కేన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుందని సర్వేల ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా, చిన్న పిల్లలకు లిప్ స్టిక్స్ వాడటం వల్ల లెర్నింగ్ డిజబుల్టీస్, నరాలు దెబ్బతినడం, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఒకరు వాడిన లిప్ స్టిక్ మరొకరు వాడటం వల్ల వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ ఫెక్షన్స్ తలెత్తుతాయని, చర్మ వ్యాధులకు గురవుతారని వైద్యులు చెబుతున్నారు. సాధ్యమైనంతవరకు, నేచురల్ కలర్స్ లిప్ స్టిక్స్ వాడితే దుష్పరిణామాలుం తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా, లిప్ స్టిక్ తయారీలో కాడ్మియం, క్రోమియం, అల్యూమినియం, లెడ్ ఉపయోగిస్తారు. లెడ్ శరీరంలోకి చేరడం వల్ల నరాలకు సంబంధించిన సమస్యలు, కాడ్మియం, అల్యూమినియంతో కిడ్నీ సమస్యలు, కేన్సర్ వ్యాధులు వచ్చే అవకాశముంది.

  • Loading...

More Telugu News