: గాయత్రి మంత్రానికి ముగ్ధుడైన పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్


ఓ హిందూ యువతి వల్లె వేసిన గాయత్రి మంత్రానికి పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ ముగ్ధుడై పోయారు. పాకిస్థాన్ లోని హిందువులు ఇటీవల హోలి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి ప్రధాని నవాజ్ సహా పలువురు ప్రభుత్వ పెద్దలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నరోదా మాలిని అనే బాలిక గాయత్రి మంత్రాన్ని వల్లె వేసింది. ప్రధాని నవాజ్ తో పాటు వేదికపై ఉన్న ప్రతిఒక్కరూ శ్రద్ధగా గాయత్రి మంత్రాన్ని విన్నారు. అనంతరం, బాలికను చప్పట్లతో అభినందించారు. అంతకుముందు, నవాజ్ మాట్లాడుతూ, పాక్ లోని మైనార్టీలు అయిన హిందువులకు అన్ని రకాల రక్షణను కల్పిస్తామని, వారి హక్కులను రక్షించడం తమ బాధ్యత అని అన్నారు.  

  • Loading...

More Telugu News