: ఆల్వాల్ సిండికేట్ బ్యాంకులో అగ్నిప్రమాదం


విద్యుదాఘాతం కారణంగా సికింద్రాబాద్ పరిధిలోని ఆల్వాల్  సిండికేట్ బ్యాంకులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బ్యాంకులో ఒక్కసారిగా దట్టమైన పొగలు వ్యాపించడంతో  సిబ్బంది పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఫర్నిచర్, కొన్ని విలువైన ఫైల్స్ దగ్ధమై పోయాయి. బ్యాంకులో అగ్నిప్రమాదం సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

  • Loading...

More Telugu News