: తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా!
రాంచీ వేదికగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తోన్న టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ఆసీస్ ఇచ్చిన 451 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనర్లుగా లోకేశ్ రాహుల్, మురళీ విజయ్‌లు క్రీజులోకి వచ్చిన విషయం తెలిసిందే. ధాటిగా ఆడి అర్ధ సెంచరీ నమోదు చేసుకున్న రాహుల్ 67 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కమ్మిన్స్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. మరో ఓపెనర్ మురళీ విజయ్ 23 పరుగులతో క్రీజులో ఉన్నాడు. రాహుల్ అవుట్ అయిన అనంతరం క్రీజులోకి పుజారా వచ్చాడు. ప్రస్తుతం టీమిండియా స్కోరు ఒక వికెట్ నష్టానికి 96 పరుగులు (32ఓవర్లకి)గా ఉంది.