: పాలన సరిగా లేకపోతే ఓటేసే పరిస్థితిలో ప్రజలు లేరు: సీఎం కేసీఆర్
ప్రజలు ఇప్పుడు తెలివిగా ఆలోచిస్తున్నారని, పరిపాలన సరిగా లేకపోతే ఓటేసే పరిస్థితిలో లేరని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ శాసనసభలో ఈ రోజు ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి విపక్షాలు సహకరించాలని కోరారు. రాష్ట్ర ప్రగతిపై విపక్షాలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నాయని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే అప్పులు చేయక తప్పదని, అప్పులు చేయడం .. తీర్చడం అనేవి నిరంతర ప్రక్రియ అని అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టి ఎలా చేస్తున్నామో చెబుతుంటే విపక్షాలు జీర్ణించుకోలేక పోతున్నాయని విమర్శించారు. ప్రజలు, పరిశ్రమలు, రైతులను, రాబోయే అవసరాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ కొనుగోలు చేశామన్నారు. గొర్రెల పంపకం పథకానికి రాష్ట్రమే పూర్తి నిధులు భరిస్తోందని, దీంతో, కేంద్రానికి ఎటువంటి సంబంధం లేదన్నారు.