: సింహంపై ఊరేగాలన్న ఆ పెళ్లికొడుకు కోరిక తీరింది!
వివాహ వేడుకల్లో పెళ్లికొడుకు, పెళ్లికూతురిని గుర్రాలు, ఏనుగు, కార్లలో ఊరేగింపుగా తీసుకెళతారు. అయితే, సింహంపై ఊరేగేస్తే ఎలా ఉంటుంది? పాకిస్థాన్‌లో ఇప్పుడు అదే జరిగింది. ఆ దేశంలోని ఓ బిలియనీర్ తన కుమారుడు ఇర్ఫాన్ పెళ్లి సందర్భంగా సింహంపై ఊరేగిస్తూ తీసుకెళ్లాలనుకున్నాడు. అయితే, సింహంపై కూర్చుంటే అది ఊరుకోదు కదా... ఇందుకోసం ఓ ట్రక్కుపై సింహం ఉన్న బోను ఎక్కించి దానిపై ఓ కుర్చీ వేశారు. ఆ కుర్చీపై పెళ్లికొడుకు ఊరేగుతూ అందరి దృష్టినీ ఆకర్షించాడు. తన పెళ్లి వేడుక అంతా విభిన్నంగా, చాలా రిచ్‌గా ఉండాలని ఆ పెళ్లి కొడుకు తన తండ్రికి చెప్పాడట. దీంతో ఆ తండ్రీకొడుకులు ఇద్దరూ కలిసి ఇలా చేశారు.